అస్సాం పోలీసు శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి డాక్టర్ పార్థ సారథి మహంతాకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రకటించింది. ఐసిస్ భారత విభాగం అధిపతిగా అనుమానిస్తున్న హారిస్ అజ్మల్ ఫరూఖీ అరెస్టులో కీలక పాత్ర పోషించినందుకు గాను ఆయనకు కేంద్ర హోంమంత్రి దక్షతా పతకం2026 లభించింది.
ఉగ్రవాద నిరోధక చర్యలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై దాడులు, కీలక నేర పరిశోధనల్లో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్స్ నిర్వహించిన ఆపరేషన్లో మహంతా కీలక పాత్ర పోషించారు.












