మధిరలో ఆధ్వర్యంలో కూరగాయల రైతులకు శాస్త్రీయ సాగు పద్ధతులు, నాణ్యమైన విత్తనాల ఎంపిక, పురుగుతెగుళ్ల యాజమాన్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొని రైతులకు సూచనలు అందించారు.
మధిర రైతువేదికలో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మధిర బ్రీడింగ్ సైంటిస్ట్ హెడ్ శ్రీమతి రుక్మిణీదేవి మాట్లాడుతూ, కూరగాయల సాగులో రైతులు తమ ప్రాంతానికి అనుకూలమైన, అధిక దిగుబడి మరియు నాణ్యత కలిగిన రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక, ఆరోగ్యకరమైన నారు, సరైన పంట దూరం, పంటకు అనుగుణమైన రకాల ఎంపిక తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.
ఎంటమాలజీ సైంటిస్ట్ శ్రీమతి నాగస్వాతి మాట్లాడుతూ, కూరగాయల పంటల్లో వచ్చే వివిధ రకాల పురుగులను ప్రారంభ దశలోనే గుర్తించి, సమగ్ర పురుగు యాజమాన్య పద్ధతుల ద్వారా నియంత్రించుకోవాలని సూచించారు. తెల్లదోమ, తామర పురుగులు, ఆఫిడ్స్, మైట్స్, ఫ్రూట్ బోరర్ వంటి పురుగుల నివారణలో, అవసరమైనప్పుడు మాత్రమే తగిన పురుగుమందులను లేబుల్ సూచనల ప్రకారం ఉపయోగించాలని తెలిపారు.
రైతులు ( ) పద్ధతులను పాటించాలని, పసుపు మరియు నీలం స్టిక్కీ ట్రాప్స్, ఫెరోమోన్ ట్రాప్స్, పొల పరిశుభ్రత, కలుపు నియంత్రణ, జీవ నియంత్రణ పద్ధతులతో పాటు, అవసరమైనప్పుడు మాత్రమే రసాయన పురుగుమందులను వినియోగించాలని సూచించారు.
మధిర హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీ విష్ణు, కూరగాయల సాగులో ఆధునిక సాగు పద్ధతులు, డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్, నీటి యాజమాన్యం మరియు పంటలో సరైన పోషకాల నిర్వహణపై రైతులకు వివరించారు. ఉద్యానవన శాఖ ద్వారా అందుబాటులో ఉన్న సాంకేతిక సూచనలు, పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మధిర అగ్రికల్చర్ ఆఫీసర్ కె. సాయిదీక్షిత్ మాట్లాడుతూ, రైతులు నేల పరీక్ష ఆధారంగా ఎరువుల వినియోగం, సరైన నీటి యాజమాన్యం, డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్, సమగ్ర పురుగు యాజమాన్య పద్ధతులను పాటించాలని సూచించారు. పురుగుమందులను అవసరమైనప్పుడు మాత్రమే, సూచించిన మోతాదులో, లేబుల్ సిఫార్సుల ప్రకారం ఉపయోగించాలని తెలిపారు.
డైరెక్టర్లు గోపాల్ రావు, శ్రీమతి శ్రీలక్ష్మి మాట్లాడుతూ, రైతులు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పాటిస్తూ శాస్త్రీయ పద్ధతులను అవలంబించాలని, ద్వారా నిర్వహిస్తున్న రైతు శిక్షణ, అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ వంకాయలపాటి నాగేశ్వరరావు, కూరగాయల రైతుల సమస్యలు, రైతులకు అవసరమైన సాంకేతిక సహకారం, వ్యవసాయ అభివృద్ధిపై మాట్లాడారు.
అనంతరం రైతులు తమ పొలాల్లో ఎదుర్కొంటున్న పురుగులు, తెగుళ్లు, రకాల ఎంపిక, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, మార్కెటింగ్ కు సంబంధించిన సమస్యలను శాస్త్రవేత్తల దృష్టికి తీసుకురాగా, శాస్త్రవేత్తలు వాటిపై తగిన సాంకేతిక సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో లు ప్రవళిక, సుష్మ, జిష్ణుతో పాటు రైతులు పాల్గొన్నారు.












