ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నాయకులు స్వాగతించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే నాయకులకు ఇది చెంపపెట్టు లాంటిదని వారు అభివర్ణించారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును బీఆర్ఎస్ నాయకులు హృదయపూర్వకంగా స్వాగతించారు.
దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో చేరి, కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయడాన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, స్పీకర్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈ తీర్పు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనమని వారు తెలిపారు.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడే నాయకులకు ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజా తీర్పును అవమానిస్తూ జరుగుతున్న అక్రమాలకు ఈ తీర్పుతో అడ్డుకట్ట పడిందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శనంలో న్యాయస్థానంపై ఉంచిన నమ్మకం నిలబడిందని, సత్యమేవ జయతే అన్న సూక్తిని ఈ తీర్పు మరోసారి రుజువు చేసిందని అన్నారు.
పార్టీ మారినా, ప్రలోభాలకు లొంగినా చివరకు న్యాయం ముందు తలవంచాల్సిందేనని ఈ తీర్పు స్పష్టం చేసిందని బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు.











