తెలంగాణలో మహిళా సాధికారత, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల మండలం వంజరుపల్లి గ్రామంలో రూ. 10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీపార్వతి మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
శంకుస్థాపన అనంతరం, గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళా సాధికారత, సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఇటీవల గుండె శస్త్రచికిత్స చేయించుకున్న వంజరుపల్లి గ్రామ ఉపసర్పంచ్ తిరుపతిని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గజ్జంకి నందయ్య, సర్పంచ్ గంగ మల్లయ్య, మాజీ ఎంసీ చైర్మన్లు దామోదర్ రావు, నక్కల రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాలముకుందం, ఎంఆర్ఓ హకీమ్, ఎస్ఐ ఉమా సాగర్, సర్పంచ్ వంశీ, మాజీ ఎంపీటీసీ కుడుకల లక్ష్మణ్, ఎంపీఓ రవిబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డీలర్ రవి, మాజీ ఉపసర్పంచ్ హరీష్, మాజీ సర్పంచ్ గంగారం, ఏఈ విజయ్, ఏపీఎం రాజు, జిల్లా యూత్ ఉపాధ్యక్షులు సాయి, అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.











