మండల కేంద్రంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అనారోగ్యంతో ఉన్న బీఆర్ఎస్ నాయకులను, గాయపడిన వార్డు మెంబర్‌ను పరామర్శించారు. ఆరెపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ గ్రామ అధ్యక్షుడు సతీమణి మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ఓదార్చారు.
మండల కేంద్రంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గండ్ర వెంకటరమణారెడ్డి అనారోగ్యంతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధైనంపల్లి కరణ్ బాబును, ప్రమాదవశాత్తు కాలికి గాయమైన వార్డ్ మెంబర్ ధైనంపల్లి సుమన్‌ను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా, ఆరెపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షుడు అంబర్ కొండ రాజేశ్వరరావు సతీమణి సుజాత అకాల మరణం చెందగా, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని గండ్ర వెంకటరమణారెడ్డి భరోసా ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసే వారికి అండగా ఉంటానని తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షుడు గాజే రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ యూత్ అధ్యక్షుడు మారపల్లి మోహన్, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ, ఆరెపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహేందర్ రాజు తదితరులు ఉన్నారు.











