మండలం ని ఆలూరు, అల్లీపూర్, సింగరావుపేట గ్రామాల భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యం ఆదివారం బలరామ జయంతి, రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు జెండాను ఎగురవేసి, బలరాముడికి పూజలు చేశారు.
రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి అండగా నిలుస్తూ, వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమం భారతీయ కిసాన్ సంఘ్ జోనల్ అధ్యక్షులు రావుల లింగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు తిరుమల శంకర్, మండల అధ్యక్షులు బొడ్గం శైలేందర్ రెడ్డి, గ్రామశాఖ కమిటీ సభ్యులు, ఆలూరు సర్పంచ్ నల్లాల స్వామి, మాజీ సర్పంచ్ మెక్కొండ రాంరెడ్డి, రైతు నాయకులు నర్సరెడ్డి, గొడ్డండ్ల రాజగోపాల్, గొడ్డండ్ల అశోక్, గొల్లపెల్లి తిరుపతి, గొల్లపెల్లి గంగాధర్, ఓరుగంటి రాజు, దోమకొండ గణేష్, పుప్పాల రాజారెడ్డి, ముడపెల్లి వేణు, అర్పెల్లి శంకర్, కోరెపు రమేష్, జోగి కిషోర్, కొడిమ్యాల మల్లేష్, రైతులు పాల్గొన్నారు.












