బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో, వరుసగా ఐదు రోజులు బ్యాంకులు మూసివేస్తే ప్రజలకు కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతితో ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.
బ్యాంక్ ఉద్యోగులు 29, 30 తేదీల్లో సమ్మె నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనితో పాటు 26వ తేదీ నాలుగో శనివారం, ఆదివారం సెలవులు కూడా ఉన్నాయి. ఈ సెలవులతో కలిపి వరుసగా 5 రోజులు బ్యాంకులు మూతపడితే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి.
ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా () అనుమతితో ఆదివారం కూడా బ్యాంకులు తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు కొంతమేర ఉపశమనం లభించనుంది.


