భారత ఎన్నికల సంఘం తన నిర్ణయాలపై వస్తున్న ఆరోపణలను ఖండించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిల ఏకాభిప్రాయంతోనే లేదా మెజారిటీ సంతకాలతోనే ఈసీ నిర్ణయాలు అమలవుతాయని స్పష్టం చేసింది.
కొత్తగూడెం, హైదరాబాద్: భారత ఎన్నికల సంఘం తన నిర్ణయాలపై వస్తున్న ఆరోపణలను ఖండించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిల ఏకాభిప్రాయంతోనే లేదా మెజారిటీ సంతకాలతోనే ఈసీ నిర్ణయాలు అమలవుతాయని స్పష్టం చేసింది.
ఆరోపణలపై ఈసీ స్పందన
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ విపక్షాలు చేసిన ఆరోపణలను ఈసీ వర్గాలు తోసిపుచ్చాయి. ఈసీ నిర్ణయాలన్నీ పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు లోబడి అందరి అభిప్రాయాలతోనే జరుగుతాయని స్పష్టం చేశాయి.
అంతర్గత చర్చల సమయంలో అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు రావడం సహజమని, అయితే తుది నిర్ణయాలు మాత్రం పూర్తి కమిషన్ ఆమోదంతోనే తీసుకున్నట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి.











