మధిర నియోజకవర్గంలోని జిలుగుమాడు గ్రామంలో అకాల వర్షాల కారణంగా ఇళ్లలోకి చేరుతున్న వర్షపు నీటి సమస్యకు మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత రామనాథం తక్షణ పరిష్కారం చూపారు. స్థానిక కౌన్సిలర్లు సమస్యను దృష్టికి తీసుకురాగానే ఆమె వెంటనే స్పందించారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో జిలుగుమాడు గ్రామంలో వర్షపు నీరు వెళ్లేందుకు సరైన మార్గం లేక ఇళ్లలోకి చేరుతోంది. ఈ సమస్య తీవ్రతను ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ యన్నం కోటేశ్వరరావు, ఒకటో వార్డు కౌన్సిలర్ దోర్నాల శిరీషవెంకట రవి మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత రామనాథం దృష్టికి తీసుకెళ్లారు.
సమాచారం అందిన వెంటనే మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత స్పందించి, జేసీబీ సహాయంతో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రామంలో అవసరమైన చోట బుర్రలు (కాలువలు) ఏర్పాటు చేయించి, వర్షపు నీరు సులభంగా బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టారు.
ఈ సత్వర చర్యల వల్ల వర్షపు నీటి సమస్య నుంచి ఉపశమనం లభించింది. సమస్యను వెంటనే పరిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత రామనాథం గారికి, కౌన్సిలర్లు యన్నం కోటేశ్వరరావు, దోర్నాల శిరీషవెంకట రవి గార్లకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.


