జగిత్యాల పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకల్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తులసినగర్ లో బ్యాండ్ సౌండ్ కు అనుగుణంగా డాన్స్ చేస్తున్న యువకుడు అకస్మాత్తుగా అశ్వస్థతకు గురై కింద పడిపోయాడు. సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో, పోలీసులు సకాలంలో స్పందించి అతన్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
జగిత్యాల పట్టణంలోని తులసినగర్ లో వినాయక నిమజ్జన ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది. బ్యాండ్ వాయిస్తున్న సంగీతానికి అనుగుణంగా డాన్స్ చేస్తున్న తోపారపు జయంత్ అనే యువకుడు అకస్మాత్తుగా అశ్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
వెంటనే అతనికి సహాయం అందించేందుకు 108 అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అయితే, అంబులెన్స్ ఘటనా స్థలానికి సమయానికి చేరుకోలేదు. ఈ నేపథ్యంలో, అక్కడే ఉన్న కుమారస్వామి వెంటనే స్పందించి, యువకుడికి సీపీఆర్ చేశారు. అనంతరం, తన పోలీసు వాహనంలో అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే యువకుడు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు తులసి నగర్ ప్రాంతానికి చెందిన తోపారపు జయంత్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో నిమజ్జన వేడుకల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.



