జగిత్యాల జిల్లా మండలం కొత్తపేటలో గణేష్ నిమజ్జన వేడుకల్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్కు గురై కొప్పుల రాజశేఖర్ (23) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళితే, బుధవారం రాత్రి కొత్తపేటలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా, సౌండ్ బాక్సులకు విద్యుత్ సరఫరా చేస్తున్న మెయిన్ వైర్లను కర్రతో సరిచేసే ప్రయత్నంలో యువకుడు కొప్పుల రాజశేఖర్ విద్యుత్ షాక్కు గురయ్యాడు. రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుడి మృతితో కొత్తపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.



