మండలం అల్లీపూర్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద గత కొన్ని నెలలుగా ఐమాక్స్ లైట్ పనిచేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో చీకటి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై 14వ వార్డు సభ్యురాలు సుతారి రోజా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అల్లీపూర్ గ్రామంలోని 14వ వార్డులో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఉన్న ఐమాక్స్ లైటు గత కొన్ని నెలలుగా పనిచేయడం లేదు. దీనివల్ల రాత్రి వేళల్లో ఆ ప్రాంతం చీకటిమయంగా మారుతోంది. ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యపై 14వ వార్డు సభ్యురాలు సుతారి రోజా అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో వరుసగా మూడుసార్లు వార్డు మెంబర్గా గెలిచిన ఆమె, ఎన్నోసార్లు గ్రామసభల్లోనూ, అధికారుల దృష్టికి కూడా ఈ ఐమాక్స్ లైట్ సమస్యను తీసుకెళ్లినట్లు తెలిపారు. అయినప్పటికీ అధికారులలో ఎలాంటి చలనం లేకపోవడం పట్ల ఆమె మండిపడ్డారు. ప్రస్తుతం చీకటి కారణంగా రాత్రిపూట ప్రజలు కాలినడకన వెళ్లేందుకు కూడా భయపడుతున్నారని, ఒకవేళ ఇక్కడ ఏదైనా ప్రమాదం సంభవిస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని సుతారి రోజా అధికారులను నిలదీశారు. సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి, పాడైపోయిన ఐమాక్స్ లైటుకు మరమ్మత్తులు చేయించి వెలిగేలా చూడాలని వార్డు సభ్యురాలు సుతారి రోజా మరియు 14వ వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






