కేశంపేట్ కేశంపేట్ మండలంలో గ్రామ సభల నిర్వహణపై గందరగోళం నెలకొంది. సమావేశాల తేదీలు, సమయం, ప్రణాళికను ఎవరు ప్రకటించాలనే దానిపై గ్రామస్థుల్లో స్పష్టత కొరవడింది. అధికారులు ప్రకటిస్తారా లేక సర్పంచులే తెలియజేస్తారా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.
Kshamకేశంపేట్ కేశంపేట్ మండల కేంద్రంలో మంగళవారం జరిగిన జనరల్ బాడీ సమావేశానికి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. Kకేశంపేట్మండల స్థాయి అధికారులు, Kకేశంపేట్మండలంలోని గ్రామాల సర్పంచులతో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు.
అయితే, గ్రామ సభల నిర్వహణపై ఇప్పుడు అసలు ప్రశ్న మొదలైంది. గ్రామ సభల తేదీలు, సమయం, సమావేశాల ప్రణాళికను ఎవరు ప్రకటించాలి అధికారులు ప్రకటిస్తారా లేక ఆయా గ్రామాల సర్పంచులు ప్రజలకు తెలియజేస్తారా అనే దానిపై గ్రామస్థుల్లో స్పష్టత లేకుండా ఉంది. ఈ విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు గ్రామ సభలు కీలకమైన వేదికలు. అలాంటి సమావేశాల తేదీలను ముందుగానే ప్రజలకు తెలియజేస్తేనే ఎక్కువ మంది గ్రామస్థులు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కేవలం సమావేశాలు నిర్వహించామని చెప్పుకోవడం కాకుండా, ఏ గ్రామంలో ఎప్పుడు గ్రామ సభ నిర్వహించబోతున్నారు ఎవరు బాధ్యత వహిస్తున్నారు ప్రజలకు ఎన్ని రోజుల ముందుగా సమాచారం అందిస్తారు అనే విషయాలను అధికారులు స్పష్టంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది.
గ్రామ సభల నిర్వహణకు సంబంధించిన పూర్తి ప్రణాళికను Kshamకేశంపేట్ కేశంపేట్ మండల అధికారులు గ్రామాల వారీగా ప్రకటిస్తారా లేక సర్పంచులకు బాధ్యత అప్పగించి వారే ప్రజలకు సమాచారం అందిస్తారా అన్నది అధికారులు స్పష్టం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామ సభలకు అర్థం ఉంటుందని, సమాచారం లేకుండా నిర్వహించే సభలు ఎవరికీ ఉపయోగపడవని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గ్రామ సభల షెడ్యూల్ను ముందుగానే ప్రకటించి, ప్రతి గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సమాచారం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో అధికారులు వెంటనే స్పందించి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.


