జగిత్యాల, 2026-06-05
ప్రజలకు పోలీస్ సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందించేందుకు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ సూచించారు. జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో బ్లూ కోల్ట్ మరియు పెట్రో కార్ సిబ్బందితో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ప్రజలకు పోలీస్ సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందించేందుకు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ సూచించారు. జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో బ్లూ కోల్ట్ మరియు పెట్రో కార్ సిబ్బందితో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
విజిబుల్ పోలీసింగ్ కీలకం
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బ్లూ కోల్ట్, పెట్రో కార్స్ సిబ్బంది విజిబుల్ పోలీసింగ్, అత్యవసర స్పందన, నేర నియంత్రణ, నేరస్తులపై నిఘా, కమ్యూనిటీ పోలీసింగ్‌లో కీలక పాత్ర పోషించాలని సూచించారు. హాట్స్పాట్ల వద్ద పెట్రోల్ వాహనాలను కొద్దిసేపు నిలిపి, అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలు, కదలికలను నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు. ముఖ్యంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
-112 కాల్స్‌కు తక్షణ స్పందన
కంట్రోల్ రూమ్, పోలీస్ స్టేషన్, -112 లేదా ప్రజల నుంచి అత్యవసర సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఎస్పీ సూచించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడం, బాధితులు మరియు సాక్షుల నుంచి సమాచారం సేకరించడం, సంఘటనా స్థలాన్ని భద్రపరచడం వంటి చర్యలను వెంటనే చేపట్టాలని తెలిపారు. రౌడీషీటర్లు, , , అనుమానితులు, ఆస్తి సంబంధిత నేరస్తులు, దొంగసొత్తు కొనుగోలు చేసే వ్యక్తులు, తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగించాలని సూచించారు.
కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత
కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యతనిస్తూ పాఠశాలలు, కళాశాలలు, కాలనీలు, రెసిడెంట్ అసోసియేషన్లు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో తరచూ కమ్యూనిటీ సమావేశాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు.
సిబ్బందిని అభినందించిన ఎస్పీ
ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల్లో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తులను సకాలంలో గుర్తించి, వేగంగా స్పందించి వారి ప్రాణాలను కాపాడిన బ్లూ కోల్ట్ మరియు పెట్రోల్ కార్ సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తతతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి విలువైన ప్రాణాలను కాపాడటం అభినందనీయమని పేర్కొన్నారు.
సమావేశంలో పాల్గొన్నవారు
ఈ సమావేశంలో డిఎస్పి రవి కుమార్, బ్లూ కోల్ట్ మరియు పెట్రో కార్ సిబ్బంది పాల్గొన్నారు.











