మండలం అల్లీపూర్ గ్రామంలో నేతాజీ యూత్ ఆధ్వర్యంలో 37వ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి శ్రీ విఘ్నేశ్వర, కాళికాదేవి వేషధారులతో పుర వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు.
అనంతరం గ్రామంలోని జెండా వద్ద ఏర్పాటు చేసిన మండపంలో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలు 37వ సంవత్సరం ఘనంగా జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో పురోహితులు అంగడి భువనేశ్వర్, నేతాజీ యూత్ సభ్యులు పోతు శ్రీనివాస్, గణేష్, రత్నాకర్, శ్రీకాంత్ (పండు), అక్షయ్, సుమన్ సాయి సంతోష్, మనోజ్, చందు, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల నిర్వహణకు నేతాజీ యూత్ సభ్యులు విశేష కృషి చేశారు.











