మండలం అల్లీపూర్ గ్రామంలోని కచీర్ వాడ హనుమాన్ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం, గ్రామ ఆడపడుచులు సాంప్రదాయబద్ధంగా బోనమెత్తి, పురవీధుల గుండా ఒగ్గుడోలు, డప్పు, సన్నాయి వాయిద్యాల నడుమ భక్తి శ్రద్ధలతో దుర్గమ్మకు బోనం సమర్పించారు. ఈ ఉత్సవాల్లో గ్రామ సర్పంచ్ ఎంబారి గౌతమి, కచీర్ వాడ హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












