మండలం కురుమపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ సర్పంచ్ మ్యాకల గంగమల్లు తల్లి ఇందిరమ్మ నూతన గృహంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే ఆమెకు చీరను కానుకగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
కురుమపల్లి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను నెరవేర్చడంలో ఇందిరమ్మ పథకం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ గృహప్రవేశ కార్యక్రమంలో సర్పంచ్ మ్యాకల మల్లేష్, మండలం సింగిల్ విండో చైర్మన్ రవీందర్, జగిత్యాల జిల్లా డిసిసి కార్యదర్శి మోఖీద్, మాజీ ఉపసర్పంచ్ రాచమడుగు సాగర్ స్పందన, వ్యవసాయం మార్కెట్ కమిటీ సభ్యులు వేణు రావు, నరేష్ పాల్గొన్నారు. అలాగే 8వ వార్డ్ మెంబెర్ అనుమల్ల రాజ్ కుమార్, 4వ వార్డ్ మెంబెర్ గంగాధర్, 2వ వార్డ్ మెంబెర్ ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.












