చెరువుగట్టులో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అమ్మవారిని దుర్గా అవతారంలో ప్రతిష్టించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పలువురు ప్రముఖులు, గ్రామస్తులు దర్శించుకున్నారు.
చెరువుగట్టు హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో దుర్గా అవతారంలో అమ్మవారిని నెలకొల్పారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో అమ్మవారి వాహన దాత, చెరువుగట్టు గ్రామ సర్పంచ్ నేతకాని కృష్ణయ్య, డెకరేషన్ దాత, దేవస్థాన ఛైర్మన్ వారాల రమేష్, చెరువుగట్టు ఉపసర్పంచ్ ఆమనగంటి జలంధర్ రెడ్డి, వార్డు సభ్యులు వంటెపాక శివ, శిరీష కోక రామలింగయ్య, గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.












