పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల తుది బిల్లులను రాబోయే కొద్ది రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇళ్లు పూర్తయినా తుది బిల్లు రాలేదని లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.
8 లక్షల ఇళ్లకు ఒక్కోదానికి 5 లక్షల చొప్పున 40 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆయన తెలిపారు. అర్హులైన పేదలందరికీ మూడు, నాలుగు విడతల్లోనూ ఇళ్లను మంజూరు చేస్తామని పాలేరు పర్యటనలో ఆయన పేర్కొన్నారు.












