మండలంలో ఎమ్మెల్సీ ఓట్లను అధిక సంఖ్యలో నమోదు చేయాలని బిఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఇన్చార్జి తిప్పన విజయసింహారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని, ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని ఆయన సూచించారు.
మండలంలో ఎమ్మెల్సీ ఓట్లను అధిక సంఖ్యలో నమోదు చేయాలని బిఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఇన్చార్జి తిప్పన విజయసింహారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలో ఈరోజుకు 1299 ఎమ్మెల్సీ ఓట్లు నమోదు కాగా, బిఆర్ఎస్ కోఆర్డినేటర్లు బిఆర్ఎస్ యాప్ ద్వారా 917 ఓట్లను నమోదు చేశారని ఆయన తెలిపారు. ఇంకా అధిక సంఖ్యలో ఓట్లను నమోదు చేసి బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపునకు పాటుపడాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాలు కల్పించకుండా, ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు మంజూరు చేయకుండా యువతను, నిరుద్యోగులను, ఉద్యోగులను మోసం చేసిందని తిప్పన విజయసింహారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించి, బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సమన్వయ కమిటీ సభ్యులు అనంతుల ఆంజనేయులు, టిఆర్ఎస్ జిల్లా నాయకులు అజయ్ కుమార్, ఉపేందర్, గ్రామ శాఖ అధ్యక్షులు భువనగిరి ఉపేందర్, కాసాని ఉపేందర్, పేట సర్పంచ్ నరసింహారావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, జలీల్, మేకల వీరబాబు, రఫీ, దున్న ప్రవీణ్, పుట్ట ప్రవీణ్, కాసాని సతీష్, జలగం శివకృష్ణ, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.












