నడిగూడెం, 14 November
సూర్యాపేట జిల్లా మండలం రామాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో స్వపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో పాఠశాల కార్యకలాపాలు నిర్వహించారు. ఉపాధ్యాయులు తమతో ఎలా మసులుకుంటున్నారో, నాణ్యమైన విద్యను అందించడానికి వారు పడుతున్న కష్టాన్ని విద్యార్థులు ఈ సందర్భంగా గ్రహించారు.
సూర్యాపేట జిల్లా మండలం రామాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో, క్రమశిక్షణతో వ్యవహరించి, ఉపాధ్యాయులు తమతో రోజు ఎలా మసులుకుంటున్నారో గ్రహించారు. నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు పడుతున్న కష్టాన్ని వారు ఈ ఒక్క రోజు టీచర్లుగా మారి తెలుసుకున్నారు. గురువుల సేవలు అమూల్యమైనవని, వారి రుణం తీర్చుకోలేమని భావించి, వారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ రావ్, రామదాస్, వీరబ్రహ్మం, సుధాకర్, రాంబాబు, జానీ బేగం, శ్రీను, రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక సర్పంచి బూత్కూరు వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ నాగార్జున, సెక్రెటరీ నరసింహారావు చేతుల మీదుగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు.


