Jagtial/Raikal (ధర్మ రథం) నవంబర్ 14
రాయికల్ పట్టణంలో నూతన గృహప్రవేశం సందర్భంగా నిర్వహించిన భజన కార్యక్రమంలో పాల్గొన్న హనుమాన్ భజన మండలి సభ్యులను దంపతులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.
రాయికల్ పట్టణానికి చెందిన సిరిపురం రవి - లావణ్య దంపతులు తమ నూతన గృహప్రవేశం సందర్భంగా భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లీపూర్ కు చెందిన హనుమాన్ భజన మండలి సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించి, వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. భజనతో ఇల్లంతా భక్తిభావంతో నిండిపోయింది.
అనంతరం హనుమాన్ భజన మండలి సభ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులు హనుమాన్ భజన మండలి సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో హనుమాన్ భజన మండలి సభ్యులు, కుటుంబ సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



