Jagtial/Jagtial (ధర్మ రథం) నవంబర్ 15
జగిత్యాల నియోజకవర్గంలోని 18 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు, కంటి అద్దాలు, మందులు పంపిణీ చేశారు. జగిత్యాల పావని కంటి ఆసుపత్రి, రోటరీ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొన్నారు.
జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి ప్రివెంటివ్ క్లినిక్, రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో, జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 18 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. వారికి ఉచిత కంటి అద్దాలు, మందులు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హాజరై, నిరుపేదల కంటి చూపును మెరుగుపరచడానికి చేపట్టిన ఈ సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో డా. విజయ్, లచ్చక్కపేట మాజీ సర్పంచ్ రమణ రావు, పలువురు నాయకులు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. నిరుపేదల ఆరోగ్య సంరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.



