మల్లాపూర్, 16 November
జగిత్యాల జిల్లా మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన 6 ఏళ్ల బాలుడు అనంత లోకాలకు చేరడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. స్థానికంగా పశువుల నీటి తొట్టిలో బాలుడి మృతదేహం లభ్యమైంది.
జగిత్యాల జిల్లా మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన బాలుడు అనంత లోకాలకు చేరడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు, వడ్డెర కాలనీకి చెందిన సూర అంజి, లావణ్యల చిన్న కుమారుడు సూర బన్ని (6) ఆదివారం ఆడుకోవడానికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. చీకటిపడిన తర్వాత కూడా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాత్రి స్థానిక పశువుల నీటి తొట్టిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. బాలుడి మృతితో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.


