మధిర, 10 September
చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పట్టణంలో ఆమె విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. భూస్వామ్య, దొరల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడిన వీరనారి ఐలమ్మ అని వారు కొనియాడారు.
*చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం* *చాకలి ఐలమ్మ* వర్ధంతి సందర్భంగా పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *పారుపల్లి విజయ్ కుమార్*, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *తలుపుల వెంకటేశ్వర్లు* పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూస్వామ్య, దొరల పెత్తనానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి *చాకలి ఐలమ్మ* అని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. మహిళలు, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చూపిన తెగువ నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ *నకిరికంటి రాజేశ్వరి*, *బోడిపూడి రేవతి*, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *రంగా హనుమంతరావు*, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు *తూమాటి నవీన్ రెడ్డి*, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ *ఐలూరి సత్యనారాయణ రెడ్డి*, *సామినేని రామనాథం*, *సాలిక సురేష్*, *మువ్వా వెంకయ్య బాబు*, *పతేపరపు సంగయ్య*, *చక్రి*, *దోర్నాల సునీల్*, *దైవజ్ఞాచారి*, *అద్దంకి మంజీరా*, *మల్లెల సత్యనారాయణ*, *గాలి ప్రసాద్*, *కోటా డేవిడ్*, *కోరంపల్లి అంకమ్మరావు*, *ప్రసాద్ రెడ్డి*, *ఆవుల శ్రీనివాసరావు*, *అద్దంకి నాగరాజు*, *రాయల శ్రీనివాసరావు*, *బోడిపూడి వెంకటేశ్వరరావు* తదితరులు పాల్గొని *చాకలి ఐలమ్మకు* ఘన నివాళులర్పించారు.











