ఫరూక్నగర్, 12 September
మండల కాంగ్రెస్ పార్టీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ గా బుడ్డ నరసింహ నియమితులయ్యారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తా మండల కాంగ్రెస్ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ బుడ్డ నరసింహ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తూ, పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటానని మండల కాంగ్రెస్ పార్టీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ బుడ్డ నరసింహ తెలిపారు. మండల వర్కింగ్ ప్రెసిడెంట్గా తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, స్థానిక ఎమ్మెల్యే శంకరన్నకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా బుడ్డ నరసింహ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, రఘు నాయక్, చెంది తిరుపతి రెడ్డి, బాబర్ ఖాన్, మండల అధ్యక్షుడు శ్రీనన్నలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాయకులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు.మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తానని హామీ ఇచ్చారు.











