తిమ్మజిపేట, 12 September
జగన్ ఆత్మహత్యచేసినట్టుగా, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గుల్లకోట మాజీ సర్పంచ్
బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు, సర్పంచ్ ఆత్మహత్య వెల్గటూర్-ఎండపల్లి,గుల్లకోట :రాజకీయల్లో చురుకుగా పనిచేసిన డాక్టర్ జగన్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గుల్లకోట మాజీ సర్పంచ్ గత రాత్రి ఆత్మ హత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదం నింపింది. రాజకీయల్లో క్రియాశీలంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు,సమావేశాలు,వివిధ రాజకీయ సమావేశల్లో చురుగ్గా పాల్గొనే జగన్ రాజకీయం మోజులో ఖర్చులు పెట్టి చివరికి అప్పులు, ఈఎంఐ భారం పెరగడంతో తీవ్ర ఒత్తిడికి గురైనట్టు తెలుస్తుంది. ఆత్మ హత్యకు ముందు ఆయన రాసిన సూసైడ్ నోటులో తన ఆర్థిక ఇబ్బందులు,కుటుంబ సభ్యుల భవిష్యత్తుపై ఆందోళన,తన భార్య పిల్లలను ఆదుకోవాలని కోరినట్లు సమాచారం. జగన్ ఆత్మ హత్య రాజకీయాల్లోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరికి ఓ గుణపాఠం. జగన్ విషాదం రాజకీయా వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.ప్రజాసేవ చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చి, ఆర్థిక స్థోమతకు మించి ఖర్చులు చేసి అప్పులపాలై చివరికి ప్రాణం మీదకు తెచ్చుకునే పరిస్థితి ఎవరికీ రాకూడదు. రాజకీయలు సేవకోసం ఉండాలి.. సేవ కోసం అప్పులపాలు కాకూడదు..పదవుల కోసం కుటుంబ భవిష్యత్తు పణంగా పెట్టకూడదు ఎంత ఆర్థిక పరిస్థితి దిగజారిన ప్రాణం తీసుకోని కుటుంబాన్ని విషాదంలోకి నెట్టకూడదు.పెద్ద నాయకులు ఇలాంటి వారితో ఖర్చులు పెట్టించడం, వారిని రాజకీయం వాడుకోవడమే కాదు.. వారికి అవసరం అయినప్పుడు ఆర్థికంగా ఆదుకోవాలి. రాజకీయల కోసం అప్పుల ఊబీలో కురుకుపోయి ఎవరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు











