Jagtial/Raikal (ధర్మ రథం) సెప్టెంబర్ 05
జగిత్యాల పట్టణంలోని 40వ వార్డులో నాయిని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిపించారు. వార్డు ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని 40వ వార్డులో నాయిని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు వార్డు ప్రజలు, భగవద్భాంధవులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరై శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. నాయిని బ్రాహ్మణ సంఘం నాయకులు, సభ్యులు, వార్డు ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.












