ఖమ్మం, 9 September
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేసీఆర్ మరణాన్ని కోరేలా, హాని కలిగించేలా ప్రేరేపించే ధోరణిలో వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరమని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
*కేసీఆర్‌పై ‘మరణ’ వ్యాఖ్యలు....* *-షాద్‌నగర్ ఎమ్మెల్యే తీరుపై బీఆర్ఎస్ భగ్గు...* *-హాని చేయడానికి ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణ...* *-కేసీఆర్ భద్రతను తక్షణమే సమీక్షించాలని కోరిన బీఆర్ఎస్ నేతలు..* *-ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని 1 టౌన్ సీఐ కు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్ షేక్ మక్బూల్, మున్సిపాలిటీ మాజీ ఫ్లో లీడర్ కర్నాటి కృష్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎం డి ఖమర్ ఫిర్యాదు.* బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బి.ఆర్.ఎస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, మాజీ కార్పొరేటర్ షేక్ మక్బూల్, మరో మాజీ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎం డి ఖమర్ లు అన్నారు. కేసీఆర్ మరణాన్ని కోరేలా, ఆయనకు హాని కలిగించే విధంగా ప్రేరేపించే ధోరణిలో వ్యాఖ్యలు చేయడం తీవ్ర అభ్యంతరకరమని మండిపడ్డారు. సెప్టెంబర్ 8న ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా, ఒక న్యూస్ ఛానల్ లో ప్రసారం ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయని వారు తెలిపారు. రాజకీయ ప్రత్యర్థిపై విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో సహజమేనని, అయితే వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు, హింసకు దారితీసేలా వ్యాఖ్యలు చేయడం మాత్రం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం మౌనం వహించకూడదని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఒక ప్రజాప్రతినిధి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఉద్రిక్తతలకు, అనుచరుల మధ్య ఘర్షణలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఎమ్మెల్యే శంకరయ్య చేసినట్లు పేర్కొంటున్న వ్యాఖ్యలపై సమగ్ర దర్యాప్తు జరిపి, భారతీయ న్యాయ సంహితలోని నిబంధనల మేరకు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమిటి, వాటి వల్ల ఎలాంటి పరిణామాలకు అవకాశం ఉందన్న అంశాలపైనా దర్యాప్తు చేయాలని కోరారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రోత్సహించినా, సహకరించినా వారి పాత్రను కూడా విచారించాలని అన్నారు. ఈ వ్యాఖ్యల నిపథ్యంలో కేసీఆర్ భద్రతను ప్రభుత్వం తక్షణమే సమీక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఆయనకు ఎలాంటి హాని జరగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలకు ఒక పరిమితి ఉండాలని, ఆ పరిమితి దాటితే ప్రభుత్వం చట్టప్రకారం కఠినంగా వ్యవహరించాలని కోరుతూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ కు వారు ఫిర్యాదు చేశారు.. ఫిర్యాదు చేసిన వారిలో మాజీ కార్పొరేటర్ పల్లా రోజున రోజ్లిన బి ఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి షేక్ షకీనా, నాయకులు బండారు శ్రీను, ఇలియాస్ పాష, ముజాహిద్, గౌతమ్ బాబు, మున్నా లింగారెడ్డి, ఈజహర్ , సాజిద్, ఆజం పాషా, షరీఫ్, ఉస్మాన్ , గౌరీనాథ్, ఫెరోజ్, శైలజ , లింగరాజు తదితరులున్నారు..











