Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 11
ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది కొత్త క్రిమినల్ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, చట్టపరమైన నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. ఈ మేరకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 500 మంది సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ది. 11.09.2026 పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం.. *కొత్త క్రిమినల్ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి : పోలీస్ కమిషనర్* ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది కొత్త క్రిమినల్ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని,చట్టపరమైన నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. కొత్త క్రిమినల్ చట్టాలు–2023 అమలులోకి వచ్చిన నేపథ్యంలో 500 మంది సిటీ అర్ముడ్ రిజర్వ్ పోలీస్ అధికారులు, సిబ్బందికి చట్టాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు గత వారం రోజులుగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని (సిటీసి) సిటీ ట్రైనింగ్ సెంటర్ నిర్వహించారు. ఈ శిక్షణలో **భారతీయ న్యాయ సంహిత–2023 (BNS), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత–2023 (BNSS), భారతీయ సాక్ష్య అధినియమం–2023 (BSA)**లోని ముఖ్యమైన నిబంధనలు, కొత్త చట్టాల ప్రకారం కేసుల నమోదు, దర్యాప్తు విధానం, సాక్ష్యాల సేకరణ, డిజిటల్ మరియు ఎలక్ట్రానిక్ సాక్ష్యాల ప్రాధాన్యత, బాధితుల హక్కులు, అరెస్టు–రిమాండ్ ప్రక్రియ, కోర్టు విచారణ తదితర అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. కొత్త చట్టాల ప్రకారం కేసుల దర్యాప్తును మరింత శాస్త్రీయంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించే విధానాలపై అధికారులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వండం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా కొత్త చట్టాల అమలులో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు, దర్యాప్తు నాణ్యతను మరింత మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో సిటీసి ఏసీపీ హరినాద్ బాబు, ఆర్ ఐ నాగుల్ మీరా పాల్గొన్నారు. పి ఆర్ వో












