ధర్మపురి, 13 September
రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని కిస్మత్పూర్ 122వ డివిజన్లో రోడ్డు భద్రత, పారిశుద్ధ్య సమస్యలపై జీహెచ్ఎంసీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంకిరాల సంతోష్ గౌడ్ కోరారు. ముఖ్యంగా విద్యాపీఠం పాఠశాల సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందడం బాధాకరమని, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని కిస్మత్పూర్ 122వ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు భద్రత, పారిశుద్ధ్య సమస్యలపై జీహెచ్ఎంసీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంకిరాల సంతోష్ గౌడ్ కోరారు. కిస్మత్పూర్, బల్లగూడ ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా విద్యాపీఠం పాఠశాల సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందడం బాధాకరమని, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. 122వ డివిజన్లో పలు ప్రాంతాల్లో రోడ్లపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చివేయడంతో పాటు, ప్రమాదకరంగా ఉన్న రహదారులను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని అన్నారు. పాఠశాలలు, ప్రధాన రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేకంగా రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా డివిజన్లో ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోవడం, డ్రైనేజీలు పొంగిపొర్లడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంతోష్ గౌడ్ తెలిపారు. మురుగు నీరు నిల్వ ఉండటంతో దోమల వ్యాప్తి పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. జీహెచ్ఎంసీ మున్సిపల్ సిబ్బంది, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి రోడ్ల మరమ్మతులు, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, గుంతల పూడ్చివేత, డ్రైనేజీల శుభ్రత, చెత్త తొలగింపు మరియు దోమల నివారణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ప్రజల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జీహెచ్ఎంసీ కమిషనర్ మరియు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కిస్మత్పూర్ 122వ డివిజన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎంకిరాల సంతోష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.



