మునగాల, 2026-11-21
కోదాడ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల సూచనలతో చర్యలు చేపడుతున్నట్లు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ తెలిపారు. దళారుల వ్యవస్థను నిర్మూలించి, వ్యాపారస్తులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల సలహాలు, సూచనలు, సహకారంతో కోదాడ మార్కెట్ అభివృద్ధి చెందుతోంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ ఆధ్వర్యంలో దళారుల వ్యవస్థకు స్వస్తి పలికి, వ్యాపారస్తులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల సలహాలు, సూచనలు, సహకారంతో, పాలకవర్గ సభ్యులతో కలిసి కోదాడ వ్యవసాయ మార్కెట్ సంతను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నట్లు కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ తెలిపారు. శుక్రవారం మునగాల మండలం బరాకత్ గూడెం లో వ్యవసాయ మార్కెట్ కు సంబంధించిన చెక్ పోస్ట్ ను ఆమె తనిఖీ చేశారు.
అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ, నియోజకవర్గం నుండి ధాన్యం కొనుగోలు చేసి లారీలపై వెళ్లే వాహనదారులు చిమిర్యాల, బాలాజీ నగర్, బరాకత్ గూడెం వద్ద ఏర్పాటు చేసిన మార్కెట్ చెక్ పోస్ట్ ల వద్ద రుసుము చెల్లించి మార్కెట్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కోదాడ మార్కెట్ లో శని, ఆదివారాల్లో జరిగే గొర్రెలు, పశువుల సంతకు వచ్చిపోయే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, మంత్రి, ఎమ్మెల్యేల సలహాలు, సూచనలతో తాగునీరు, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రశాంతంగా రైతులు, వ్యాపారస్తులు వచ్చి వ్యాపారాలు చేసుకునే విధంగా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ధరల్లో వ్యవస్థకు స్వస్తిపలికి, వ్యాపారస్తులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గతంలో సంతలో దళారుల వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు సంతలో దళారుల వ్యవస్థ లేకుండా నేరుగా కొనుగోలుదారుడు, అమ్మకందారుడు వచ్చి సజావుగా వ్యాపారాలు చేసుకునే విధంగా పాలకవర్గ సభ్యులతో కలిసి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







