Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 09
షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై మధిర టౌన్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని బహిరంగంగా కోరుతూ, హాని కలిగించేలా ప్రేరేపించే వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు.
*కాంగ్రెస్ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై మధిర టౌన్ స్టేషన్లో బిఆర్ఎస్ ఫిర్యాదు* 👉 తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర రావు గారి మరణాన్ని బహిరంగంగా కోరుతూ హాని చేయటానికి ప్రేరేపించేలా వ్యాఖ్యల చేసిన ఎమ్మెల్యే శంకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం మధిర బిఆర్ఎస్ నాయకులు పల్లపోతు వెంకటేశ్వరావు, చిత్తారి నాగేశ్వరావు, అరిగే శ్రీనివాసరావు, బొగ్గుల భాస్కర్ రెడ్డి, చావా వేణు, వంకాయలపాటి నాగేశ్వరరావు, ఆళ్ల నాగబాబు, ప్యారి, చీధిరాల రాంబాబు, వేల్పుల శివ, వీర రాఘవరెడ్డి, బొగ్గుల వీరారెడ్డి, తదితరులు మధిర టౌన్ సిఐ రమేష్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి బహిరంగంగా చావుని కోరిన ఎమ్మెల్యే శంకర్ పై తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.











