హైదరాబాద్, 2026-06-05
హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో ఈ నెల 13వ తేదీ నుంచి చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. ఈ సేవలను గత ఐదేళ్లుగా అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

వైద్య ప్రక్రియ
ముందుగా వాక్-ఇన్ విధానంలో చిన్నారులను పరిశీలించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం, సర్జరీ అవసరమైన వారికి ఆపరేషన్లు చేస్తారు. పాత టెస్ట్ రిపోర్టులతో పాటు, సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య నిమ్స్ పాత బ్లాక్లో నేరుగా వచ్చి సంప్రదించవచ్చని సూచించారు.