మునగాల, 2026-11-28
ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద సూర్యాపేట జిల్లా, మునగాల మండలం సీతానగరం గ్రామంలో అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు.
మునగాల మండలం సీతానగరం గ్రామంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బాదావత్ వీరయ్య మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని ఆపద సంభవించినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంలో ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాదావత్ వీరయ్య, పంచాయతీ కార్యదర్శి నవిత, సూర్యాపేట జిల్లా డీసీసీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లపు సతీష్, సీనియర్ జర్నలిస్ట్ పడిశాల నాగరాజు, 2వ వార్డు సభ్యురాలు జ్యోతి, 3వ వార్డు సభ్యుడు పుల్లూరు ఉపేందర్, 8వ వార్డు సభ్యురాలు లాలమ్మ, గ్రామ పెద్దలు లెక్కల సుధాకర్ చౌదరి, పుల్లూరి శివాజీ, పుల్లూరి రమేష్, వరికుప్పల సూరి, అంగన్వాడీ టీచర్లు లలిత, లక్ష్మి, లబ్ధిదారులు పాల్గొన్నారు.



