జగిత్యాల, 2026-06-05
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆలకుంట మహేష్ కుటుంబ సభ్యులు గొప్ప మానవతా నిర్ణయం తీసుకున్నారు. తమ ఆప్తుడిని కోల్పోయిన విషాద సమయంలోనూ, మహేష్ కళ్లను దానం చేసి మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపే మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు.

మహేష్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన కళ్ల ద్వారా మరొకరి జీవితంలో వెలుగు ప్రసరించనుంది. అవయవదానం, నేత్రదానం మహాదానం అనే సందేశాన్ని మహేష్ కుటుంబ సభ్యులు తమ చేతల ద్వారా సమాజానికి చాటిచెప్పారు.
కుటుంబ సభ్యుల సేవాభావం
తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ నేత్రదానానికి ముందుకు వచ్చిన మహేష్ కుటుంబ సభ్యుల సేవాభావాన్ని పలువురు అభినందించారు. ప్రతి ఒక్కరూ నేత్రదానం పట్ల అవగాహన పెంచుకుని, మరణానంతరం తమ కళ్లను దానం చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నారు.
ఘన నివాళులు
మహేష్ ఇక మన మధ్య లేకపోయినా ఆయన కళ్లలోని వెలుగు మరొకరి జీవితంలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి కళ్లు దానం చేసేందుకు తల్లిదండ్రులు ఆలకుంట పోచయ్య, లక్ష్మి, వారి అన్న సంతోష్ ముందుకు వచ్చారు. గ్రామ సర్పంచ్ బోదాస్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ రాజేష్, మాజీ సర్పంచ్ మన్నెగుండ్ల వెంకమ్మ, నరసయ్య, ఎస్సై సుదీర్ రావు, ఎస్ఐ దేవేందర్, ఫోరెన్సిర్ వైద్యులు శ్రీనివాస్, నరేష్, రాజలింగం, పాపయ్య, గ్రామ ప్రజలు మహేష్‌కు ఘన నివాళులు అర్పించారు.