సోమవారం (ధర్మ రథం) సెప్టెంబర్ 07
శాయంపేటపత్తిపాక రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, పర్యవేక్షణ లోపిస్తోందని బహుజన సంక్షేమ సంఘం (బీఎస్ఎస్) నాయకులు ఆరోపించారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా, శాయంపేట మండల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్‌తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నాసిరకం పనులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ *రోడ్డు పనుల్లో నాణ్యత కరువు అధికారుల పర్యవేక్షణ కరువు *మండల స్థాయి ప్రజావాణిలో ఫిర్యాదు శాయంపేట,సెప్టెంబరు 7: శాయంపేట–నాగసముద్రం కట్ట మీదుగా పత్తిపాక వరకు చేపడుతున్న బీటీ రోడ్డు పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని బహుజన సంక్షేమ సంఘం (బీఎస్ఎస్) నాయకులు డిమాండ్ చేశారు. నాసిరకం పనులు చేస్తున్నకాంట్రాక్టర్పైచర్యలుతీసుకోవడంతోపాటు పనులను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు బీఎస్ఎస్ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు మారెపల్లి విజయ్‌కుమార్, శాయంపేట మండల అధ్యక్షుడు మారెపల్లి సుధాకర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఎం ఆర్ ఆర్ నిధులతో రూ.1.50 ఒక కోటి యాభై లక్షల అంచనా వ్యయంతో రహదారి పనులు చేపడుతున్నట్లు వారు తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోయినా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం లేదని ఆరోపించారు. రహదారిపై కంకర పోసి వదిలేయడంతో వ్యవసాయ పనుల కోసం నిత్యం రాకపోకలు సాగించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రోడ్డు పనుల్లో భాగంగా నాగసముద్రం మత్తడి వద్ద లో లెవెల్ వంతెన తోపాటు మరో నాలుగు కల్వర్టులు, నిర్మించాల్సి ఉందన్నారు. పనుల్లో వినియోగిస్తున్న నిర్మాణ సామగ్రి నాణ్యతను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు. నాసిరకం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌తోపాటు పనులను సక్రమంగా పర్యవేక్షించని సంబంధిత అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రోడ్డు పనులను వెంటనే పరిశీలించి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని, లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని వారు హెచ్చరించారు.











