సీపీఐ(ఎం) (ధర్మ రథం) సెప్టెంబర్ 12
పార్టీ మాజీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి, కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి సందర్భంగా షాద్‌నగర్‌లో పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. షాద్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి, నాయకులు, కార్యకర్తలు ఆయన సేవలను స్మరించుకున్నారు.
సీతారాం ఏచూరి ఆశయాల సాధనకు పోరాటాలు చేద్దాం షాద్‌నగర్‌లో ఘనంగా సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి షాద్‌నగర్: పార్టీ మాజీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి, కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి సందర్భంగా షాద్‌నగర్‌లో పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. షాద్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు, కార్యకర్తలు ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఎన్. రాజు, షాద్‌నగర్ పట్టణ కార్యదర్శి శ్రీనునాయక్ మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి ఉన్నత విద్యను అభ్యసించి, తన జీవితాన్ని పేదలు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల కోసం అంకితం చేశారని తెలిపారు. విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై పోరాటాలు ప్రారంభించిన ఆయన, విద్యార్థి నాయకుడిగా మొదలై జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. పార్లమెంట్, రాజ్యసభలో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల తరఫున బలమైన గొంతుకగా నిలిచారని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపై లోతైన అవగాహన కలిగిన సీతారాం ఏచూరి ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, లౌకికవాదం కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ స్వలాభం కోసం పనిచేస్తున్నాయని నాయకులు విమర్శించారు. కుల, మత రాజకీయాలతో ప్రజల మధ్య విభజన సృష్టిస్తూ అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ సీతారాం ఏచూరి చూపిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆయన ఆశయాల సాధన కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని కామ్రేడ్ సీతారాం ఏచూరికి ఘన నివాళులర్పించారు.











