శాయంపేట్ (వరంగల్), 9 September
గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు నిర్వాహకులకు పలు సూచనలు, జాగ్రత్తలు తెలియజేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో మండపాలు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.
*గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసుల సూచనలు* గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు, సభ్యులను పోలీసులు పిలిపించి తగు సూచనలు, జాగ్రత్తలను తెలియజేశారు. సీఐ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన, ఎస్ఐ పరమేశ్ సమక్షంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద భద్రతా చర్యలు పాటించాలని, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని, నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహించాలని పోలీసులు సూచించారు. ప్రజలు, భక్తులు సహకరించి గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని కోరారు.








