శాయంపేట్, 9 September
మండలం గోవిందాపూర్ గ్రామానికి చెందిన రైతు బొత్త లక్ష్మికి చెందిన 0.20 గుంటల వరి పంట పొలంలో కక్షపూరితంగా గడ్డిమందు చల్లి నాశనం చేసిన ముగ్గురిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మాందాటి తిరుపతి, మాందాటి తిరుమలేశ్, మాందాటి కుమారస్వామిలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు.
*పంట పొలంపై కక్షపూరితంగా గడ్డిమందు కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి* మండలం గోవిందాపూర్ గ్రామానికి చెందిన బొత్త లక్ష్మి గారికి చెందిన వరి పంట 0.20 గుంటల పొలంలో కక్షపూరితంగా గడ్డిమందు కొట్టి పంటను నాశనం చేసిన మాందాటి తిరుపతి, మాందాటి తిరుమలేశ్, మాందాటి కుమారస్వామి లపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. బొత్త లక్ష్మి సాగు చేస్తున్న వరి పొలంలో గతంలో వేసిన వరి నాటును ఎడ్ల గొర్రుతో పంటను చెడగొట్టగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్టి విషయంపై పెద్దమనుషులు పంచాయతీ చేయగా వినకుండా మరల వేసిన వరి పంట పెరిగిన తర్వాత గడ్డిమందు కొట్టడంతో వరి పంట దెబ్బతిని తీవ్ర నష్టం వాటిల్లిందని వారు తెలిపారు. వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ చర్యకు పాల్పడినట్లు ఆరోపించారు. రైతు కష్టపడి సాగు చేసిన పంటను నాశనం చేయడం దుర్మార్గమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు, పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.












