హైదరాబాద్, 2026-06-05
ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి సారథ్యంలో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రజల ఆకాంక్షలను కేంద్రంగా చేసుకుని సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పాలనలో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, కార్మికులు, పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే అనేక పథకాలు అమలు చేయబడ్డాయి.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి సారథ్యంలో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రజల ఆకాంక్షలను పాలనకు కేంద్రబిందువుగా చేసుకుని సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లామని ప్రభుత్వం తెలిపింది. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, కార్మికులు, పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా పలు సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు, కొత్త చట్టాలు, విధానాలు, సంస్థలు, పరిపాలనా సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
రైతు సంక్షేమానికి పెద్దపీట
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. పంట రుణమాఫీ కింద రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేసి 25 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు ఉపశమనం కల్పించినట్లు ప్రభుత్వం పేర్కొంది. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయం అందించడంతో పాటు, సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ అమలు చేసింది. రైతు బీమా, ఉచిత విద్యుత్, పంట నష్టపరిహారం, ధాన్యం కొనుగోళ్ల ద్వారా రైతులకు అండగా నిలిచామని తెలిపింది. రెండు సీజన్లలో 1.47 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.35,077 కోట్ల చెల్లింపులు చేసినట్లు వెల్లడించింది.
మహిళలు, పేదలకు సంక్షేమం
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించగా, 335 కోట్లకుపైగా ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. గృహజ్యోతి ద్వారా 53 లక్షలకుపైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, దాదాపు 43 లక్షల కుటుంబాలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు పేర్కొంది. 15 లక్షలకుపైగా కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సామాజిక భద్రతా పింఛన్ల విస్తరణ వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపింది.
సామాజిక న్యాయానికి ప్రాధాన్యం
రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్లకుపైగా కుటుంబాలను కవర్ చేస్తూ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే పూర్తి చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అమలు చేయడంతో పాటు, బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభ ఆమోదించి కేంద్రానికి పంపినట్లు తెలిపింది.
ప్రభుత్వ విద్యారంగంలో పలు సంస్కరణలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ లక్ష్యంతో 105 పాఠశాలలకు మంజూరు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభం, విద్యార్థులకు అల్పాహారం, పాలు, పోషకాహారం వంటి కార్యక్రమాలను అమలు చేసినట్లు తెలిపింది. మెగా డీఎస్సీ ద్వారా 10,006 మంది ఉపాధ్యాయుల నియామకం, మొత్తం మీద ప్రజా ప్రభుత్వ హయాంలో 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, టీ-హబ్, టీ-వర్క్స్, టాస్క్, వీ-హబ్ వంటి సంస్థల ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను విస్తరించినట్లు పేర్కొంది.











