హైదరాబాద్, 2023-11-15
తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్ నెలలో రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్ నెలలో రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
కార్పొరేషన్ ఎన్నికలు
సైబరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.
ఆగిపోయిన చోట్ల కూడా
వివిధ కారణాల వల్ల గతంలో ఆగిపోయిన అచ్చంపేట, మందమర్రి, మణుగూరు, నకిరేకల్, కొత్తూరు, సిద్ధిపేట మున్సిపాలిటీలకు కూడా అదే నెలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం.