నిర్ణయంపై, 2 నవంబర్ 2026
గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (- ) చట్టం, 2025 కింద ఈ ఫిర్యాదుల పరిష్కార నిబంధనలు2026ను విడుదల చేసింది. దీని ద్వారా ఫిర్యాదుల స్వీకరణ, విచారణ, పరిష్కారానికి నిర్దిష్ట విధానం అమలు కానుంది.
గ్రామ పంచాయతీ, బ్లాక్, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రజలు నేరుగా, లిఖితపూర్వకంగా లేదా డిజిటల్ విధానంలో తమ ఫిర్యాదులను సమర్పించవచ్చు. ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా నమోదు చేసి, ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో కూడిన రసీదు ఇవ్వాలి. ఫిర్యాదులను స్వీకరించేందుకు అధికారులు ప్రతి వారం నిర్ణీత రోజున అందుబాటులో ఉండాలి.
7 రోజుల్లో విచారణ, 15 రోజుల్లో పరిష్కారం
ఫిర్యాదు అందిన ఏడు పని దినాల్లో విచారణ, అవసరమైతే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి. అనంతరం తీసుకోవాల్సిన చర్యలతో కలిపి 15 రోజుల్లో ఫిర్యాదును పరిష్కరించాలి. నిర్ణీత సమయంలో ఫిర్యాదును పరిష్కరించకపోతే, సంబంధిత అధికారులపై చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 15 రోజుల్లో పరిష్కారం కాని ఫిర్యాదులు, డిజిటల్ వ్యవస్థ ద్వారా తదుపరి ఉన్నత స్థాయికి ఆటోమేటిక్‌గా బదిలీ అవుతాయి.
అప్పీల్ ప్రక్రియ
ఫిర్యాదుపై వచ్చిన నిర్ణయంతో బాధితులు సంతృప్తి చెందకపోతే, అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. గ్రామ పంచాయతీ నిర్ణయంపై ప్రోగ్రామ్ ఆఫీసర్‌కు, ప్రోగ్రామ్ ఆఫీసర్ నిర్ణయంపై జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్‌కు, జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నిర్ణయంపై రాష్ట్ర ఫిర్యాదుల పరిష్కార అథారిటీకి లేదా ప్రభుత్వం నియమించిన అధికారికి అప్పీల్ చేయవచ్చు. నిర్ణయం వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లో అప్పీల్ దాఖలు చేయాలి. అప్పీల్ అందిన 30 రోజుల్లో దానిపై నిర్ణయం తీసుకోవాలి.
పారదర్శకత, జవాబుదారీతనం పెంపు
గ్రామీణ ఉపాధి పథకం అమలులో పారదర్శకత, అధికారుల జవాబుదారీతనం పెంచడమే ఈ నిబంధనల ప్రధాన లక్ష్యమని కేంద్రం పేర్కొంది. ఫిర్యాదుల స్థితిని డిజిటల్ విధానంలో ట్రాక్ చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా గ్రామీణ కూలీలకు సకాలంలో న్యాయం అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో ఎదురయ్యే సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు2026ను నోటిఫై చేసింది. ఈ నిబంధనల ప్రకారం, ఫిర్యాదులను 7 రోజుల్లో విచారించి, 15 రోజుల్లో పరిష్కరించాలి. నిర్ణీత గడువులోగా పరిష్కారం కాని ఫిర్యాదులు ఉన్నత స్థాయికి బదిలీ అవుతాయి. బాధితులు 45 రోజుల్లో అప్పీల్ చేసుకోవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు
గ్రామీణ ఉపాధి పథకం ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త నిబంధనలు ఏమిటి?
కేంద్ర ప్రభుత్వం 2026 నిబంధనలను నోటిఫై చేసింది. దీని ప్రకారం, ఫిర్యాదులను 7 రోజుల్లో విచారించి, 15 రోజుల్లో పరిష్కరించాలి. ఉన్నత స్థాయికి బదిలీ, అప్పీల్ ప్రక్రియలు కూడా నిర్దేశించబడ్డాయి.


