జగిత్యాల, 2 September
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా, ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ వైఫల్యాలను నిరసిస్తూ, వెంటనే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు జగిత్యాలలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
జగిత్యాల, బిఆర్ఎస్ భారీ నిరసన ర్యాలీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ వైఫల్యాలను నిరసిస్తూ, వెంటనే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు జగిత్యాలలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినప్పటికీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ వైఫల్యాలను నిరసిస్తూ, వెంటనే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు జగిత్యాలలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడిపత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జగిత్యాల జిల్లా తొలి చైర్ పర్సన్ దావ వసంత. గారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. సుమారు 1000 అడుగుల పొడవైన బ్యానర్‌ను ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు తమ నిరసనను తెలియజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా రైతు భరోసా పెంపు, నిరుద్యోగ భృతి, సన్న వడ్లకు బోనస్, విద్యా భరోసా కార్డ్, రైతు కూలీలకు రూ.1200 ఆర్థిక సహాయం, ఆటో కార్మికులకు హామీ ఇచ్చిన రూ.1200 ఆర్థిక సహాయం వంటి కీలక హామీలను వెంటనే నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే తగిన విధంగా స్పందించాల్సి వస్తుందని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.












