విజయనగరం, 2026-06-05
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప దార్శనికత కలిగిన నాయకుడని, ఆయన మంచి మనసున్న వ్యక్తి అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా దాన్ని అద్భుతంగా, పరిపూర్ణంగా తీర్చిదిద్దడం చంద్రబాబుకే చెల్లిందని, నిరంతర శ్రమతో దార్శనికతను ప్రదర్శించే ఆయన నిజమైన అభివృద్ధికి చిరునామా అని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప దార్శనికత కలిగిన నాయకుడని, ఆయన మంచి మనసున్న వ్యక్తి అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా దాన్ని అద్భుతంగా, పరిపూర్ణంగా తీర్చిదిద్దడం చంద్రబాబుకే చెల్లిందని, నిరంతర శ్రమతో దార్శనికతను ప్రదర్శించే ఆయన నిజమైన అభివృద్ధికి చిరునామా అని కొనియాడారు. రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతితో పాటు ప్రజల సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ పాలన అందించడంలో ఆయన శైలి అసాధారణమైనదని రాష్ట్రపతి పేర్కొన్నారు.
ఎంపీ కుటుంబంతో రాష్ట్రపతి ఆత్మీయ భేటీ
విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన కుటుంబసభ్యులతో కలసి రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కుటుంబసభ్యులతో రాష్ట్రపతి ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. భేటీ సమయంలో అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన విశేషాలతో రూపొందించిన ప్రత్యేక కాఫీ టేబుల్ బుక్‌ను అప్పలనాయుడు రాష్ట్రపతికి అందజేశారు. దాన్ని ఎంతో సంతోషంగా స్వీకరించిన ముర్ము, పుస్తకాన్ని తెరిచి అందులోని అమరావతి ప్రతిపాదిత నమూనాలు, చారిత్రక ఘట్టాల ఫోటోలను ఆసక్తిగా తిలకించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రూపుదిద్దుకుంటున్న అమరావతి రూపురేఖలను చూసి ఆనందం వ్యక్తం చేశారు.
భోగాపురం విమానాశ్రయంపై ప్రస్తావన
ఈ సందర్భంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పురోగతి గురించిన ప్రస్తావన రాగా.. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగిన తీరును రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఈ విమానాశ్రయం గేట్వేగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
సామాన్య నేపథ్యం నుంచి వచ్చినవారిని చూస్తే నాకు నేనే కనిపించాను
సంభాషణ మధ్యలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తాను సామాన్య గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చానని తెలపగా, రాష్ట్రపతి స్పందిస్తూ ఆత్మీయ వ్యాఖ్యలు చేశారు. నేను కూడా సమాజంలోని అత్యంత దిగువ స్థాయి నుంచి, సామాన్య నేపథ్యం నుంచే ఈ అత్యున్నత స్థాయికి చేరుకున్నాను. మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లే ఉంది అని ఎంపీని అభినందించారు. ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ సమస్యల పట్ల స్పందించే తీరు, పార్లమెంటుకు నిత్యం సైకిల్‌పై వస్తూ సాదాసీదా జీవితం గడపడం, సభలో 100 శాతం హాజరు శాతాన్ని నమోదు చేసుకోవడం వంటి విషయాలను ప్రత్యేకంగా గుర్తుచేసి కలిశెట్టి అప్పలనాయుడి క్రమశిక్షణను, నిబద్ధతను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పదే పదే మెచ్చుకున్నారు.
విద్యారంగ సంస్కరణలపై చర్చ











