మరిపెడ, 2026-06-05
పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరిపెడలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటిఆర్ పిలుపు మేరకు ఈ నిరసన చేపట్టారు.

నియోజకవర్గ నాయకుల భాగస్వామ్యం
డోర్నకల్ నియోజకవర్గం, మరిపెడ మండల కేంద్రంలో జరిగిన ఈ ధర్నాలో డోర్నకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ గారు, మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీ గుడిపూడి నవీన్ రావు గారు, డోర్నకల్ బిఆర్ఎస్ యువనేత శ్రీ డిఎస్ రవిచంద్ర గారు పాల్గొన్నారు.
అధిక సంఖ్యలో కార్యకర్తలు
మరిపెడ మండల మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, యువ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రధాన డిమాండ్
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎలాంటి షరతులు, ఆటంకాలు లేకుండా యధావిధిగా కొనసాగించాలని నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.