రంగారెడ్డి, 11 October
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అక్షయ అద్భుత ప్రతిభ కనబరిచి 600 మీటర్ల పరుగు పందెంలో సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకుంది. శనివారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి పాఠశాలకు గుర్తింపు తెచ్చింది.
కేశంపేట: జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అక్షయ అద్భుత ప్రతిభ కనబరిచింది. శనివారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో 600 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించి సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకుంది.
రాజేంద్రనగర్ బ్రాంచ్‌కు చెందిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్, మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాల (పాలమాకుల)లో పదో తరగతి చదువుతున్న అక్షయ, చదువుతోపాటు క్రీడల్లోనూ ఆసక్తి కనబరుస్తూ వరుస విజయాలు అందుకుంటోంది. ఇటీవల ఎస్జీఎఫ్ క్రీడల్లో ప్రతిభ చాటిన అక్షయ, తాజాగా పోటీల్లోనూ రాణించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
అక్షయ సాధిస్తున్న విజయాలపై పాఠశాల ప్రిన్సిపాల్ జి. అనిత, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ అక్షయకు శుభాకాంక్షలు తెలిపారు.











