జగిత్యాల పట్టణంలోని డీపీఎస్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సయ్యద్ ఇస్మాయిల్ ఉద్దీన్ బాక్సింగ్ క్రీడలో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విజయంపై కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల పట్టణంలోని డీపీఎస్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సయ్యద్ ఇస్మాయిల్ ఉద్దీన్ బాక్సింగ్ క్రీడలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా విద్యార్థి సాధించిన విజయంపై కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 10వ తేదీన జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్లో నిర్వహించిన 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 202627 ఉమ్మడి జిల్లా స్థాయి టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్‌లో భాగంగా అండర్-14, అండర్-17 బాలబాలికల విభాగాల్లో కరాటే, బాక్సింగ్, తైక్వాండో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న సయ్యద్ ఇస్మాయిల్ ఉద్దీన్ బాక్సింగ్‌లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
సయ్యద్ ఇస్మాయిల్ ఉద్దీన్, సయ్యద్ కమల్ పాషా కుమారుడు. చిన్న వయస్సులోనే క్రీడారంగంలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు, కుటుంబానికి గర్వకారణంగా నిలిచింది.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థిని అభినందిస్తూ, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజయాలు సాధించి జగిత్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.











