జగిత్యాల జిల్లా మండలంలోని వల్లంపల్లి, తొంబారావుపేట్ గ్రామాల్లో జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
జగిత్యాల జిల్లా మండలంలోని వల్లంపల్లి, తొంబారావుపేట్ గ్రామాల్లో జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో కొనసాగుతున్న రీ సర్వే పనుల పురోగతి, సర్వే నిర్వహిస్తున్న విధానం, భూ రికార్డుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రీ సర్వే ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వే ప్రక్రియను చేపట్టాలని, భూముల హద్దులు, విస్తీర్ణం తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని సూచించారు.
సర్వే సమయంలో ఎదురయ్యే సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
రీ సర్వే ద్వారా భూ రికార్డుల్లో ఖచ్చితత్వం ఉండేలా చూడాలని, నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీఓ జీవాకర్ రెడ్డి, మండల తహసీల్దార్ , సంబంధిత అధికారులు మరియు సర్వే సిబ్బంది పాల్గొన్నారు.












