సూర్యాపేట జిల్లా మండలం చాకిరాల గ్రామంలో బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామ సర్పంచి మొగలగాని రమ్యతో పాటు మహిళలు, చిన్నారులు, పెద్దలు, వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని పండుగను ఘనంగా జరుపుకున్నారు.
చాకిరాల గ్రామంలో బతుకమ్మ పండుగను చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను ప్రత్యేకంగా జరుపుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ఆడపిల్లలను, తోబుట్టువులను పిలిపించుకొని బతుకమ్మలను పేర్చి, అభయ ఆంజనేయస్వామి గుడి సమీపంలో వేడుకలు జరిపారు. వేడుకల్లో భాగంగా పేర్చిన బతుకమ్మలను అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాల్లో పాల్గొన్నారు.












